ETV Bharat / snippets

రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌పై మూడేళ్ల నిషేధం

author img

By ETV Bharat Sports Team

Published : Aug 8, 2024, 4:18 PM IST

source ANI
Paris Olympics 2024 Wrestler Antim Panghal Banned (source ANI)

ParisOlympics AntimPanghal Banned : భారత రెజ్లర్​ అంతిమ్‌ పంఘాల్‌కు భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐవోఏ) షాక్ ఇచ్చింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడటం వల్ల మూడేళ్ల నిషేధం విధించింది. అంతిమ్‌ భారత్‌కు వచ్చిన తర్వాత నిషేధం గురించి ఐవోఏ అఫీషియల్ అనౌన్స్​మెంట్​ ఇచ్చే అవకాశం ఉందట. అంతిమ్‌ తన సోదరిని ఒలింపిక్‌ విలేజ్‌లోకి తన అక్రిడిటేషన్‌తో పంపించడం వల్ల ఐవోఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తన వస్తువులు కొన్ని ఒలింపిక్స్​ విలేజ్​లో ఉన్నట్లు సోదరి నిశాకు చెప్పి తీసుకురమ్మని అంతిమ్ చెప్పిందట. అందుకు తన అక్రిడిటేషన్‌ కార్డును ఇచ్చిందట. దీంతో నిశా ఒలింపిక్ విలేజ్​లోకి వెళ్లి వస్తువులను తీసుకొస్తుండటం వల్ల సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడ్డారు. ఆమెతో పాటు అంతిమ్​ నుంచి స్టేట్‌మెంట్​ తీసుకున్నారట. దీంతో అంతిమ్‌ అక్రిడిటేషన్‌ దుర్వినియోగం అయినట్లు ఒలింపిక్‌ నిర్వాహకులు భావించి దానిని రద్దు చేసి ఐవోఏ దృష్టికి తీసుకొచ్చారట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.