ETV Bharat / snippets

'వినేశ్​, నీకెప్పుడు అండగా ఉంటాం' - అనర్హత వేటుపై మోదీ

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 1:19 PM IST

source Associated Press and ANI
VINESH PHOGAT MODI (source Associated Press and ANI)

Paris Oympics 2024 Vinesh Phogat Modi : పారిస్ ఒలింపిక్స్​లో రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌పై విధించిన అనర్హత వేటు పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఓ ట్వీట్​ ద్వారా ఆమెను ఓదార్చారు. "వినేశ్‌, నువ్వు ఓ ఛాంపియన్లకే ఛాంపియన్‌! నీ ప్రతిభ దేశానికే గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు ఓ ఇన్​స్పిరేషన్. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ నన్ను ఎంతగానో బాధించింది. దీన్నిపై విచారం వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటలు కూడా లేవు. కానీ, ఈ బాధ నుంచి బయటపడి నువ్వు మరింత బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నాను. కఠినమైన సవాళ్లను ఎదిరించడం నీ నైజం. మేమంతా నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం" అని మోదీ వినేశ్​కు భరోసానిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.