ETV Bharat / snippets

మన షూటర్​కు లక్కీ ఛాన్స్​- ఫ్లాగ్ బేరర్​గా మను బాకర్​

author img

By ETV Bharat Sports Team

Published : Aug 4, 2024, 12:12 PM IST

Manu Bhaker
Manu Bhaker (Source: Associated Press)

Manu Bhaker Paris Olympics: పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత షూటర్‌ మను బాకర్‌కు అరుదైన గౌరవం లభించింది. విశ్వ క్రీడల ముగింపు వేడుకల్లో మను బాకర్ వుమెన్ ఫ్లాగ్ బేరర్​గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అఫీషియల్​గా ప్రకటించింది. జులై 26న ప్రారంభమైన ఈ క్రీడలు ఆగస్టు 11న ముగియనున్నాయి. మరోవైపు పురుషుల నుంచి ఫ్లాగ్ బేరర్​గా ఎవరు ఉండనున్నారన్నది తెలియాల్సి ఉంది.

కాగా, ప్రస్తుత ఒలింపిక్స్​లో భారత్ ఖాతాలో మూడు కాంస్య పతకాలు మాత్రమే ఉన్నాయి. అందులో రెండు బాకర్ సాధించినవే కావడం విశేషం. ఈమె 10మీటర్ల ఎయిర్ రైఫిల్ సింగిల్స్​, 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్​డ్ ఈవెంట్​లలో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని ముద్దాడింది. ఇక శనివారం జరిగిన 25మీటర్ల పిస్టల్ సింగిల్స్​ ఈవెంట్​ ఫైనల్​లో త్రుటిలో పతకం చేజార్చుకుంది. ఈ ఈవెంట్​లో మను నాలుగో స్థానంలో నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.