ETV Bharat / snippets

PR శ్రీజేశ్​కు భారీ నజరానా- రూ.2కోట్లు ప్రకటించిన కేరళ ప్రభుత్వం

author img

By ETV Bharat Sports Team

Published : Aug 21, 2024, 7:41 PM IST

Sreejesh Prize Money
Sreejesh Prize Money (Source: Associated Press)

Sreejesh Prize Money: పారిస్‌ ఒలింపిక్స్‌ హాకీలో కాంస్యాన్ని ముద్దాడిన మాజీ గోల్ కీపర్​ పీఆర్ శ్రీజేశ్​కు కేరళ ప్రభుత్వం రూ.2 కోట్ల నజరానా ప్రకటించింది. రాష్ట్ర సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు CMO బుధవారం ప్రకటించింది. 'భారత హాకీ జట్టులో సభ్యుడు, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన శ్రీజేశ్‌కు రెండు కోట్ల రూపాయలు బహుమతిగా అందిస్తున్నాం' అని ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా, 2004లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన శ్రీజేశ్ తాజా ఒలింపిక్స్​లో రిటైర్మెంట్ ప్రకటించాడు. దాదాపు 2దశాబ్దాలపాటు శ్రీజేశ్ భారత హాకీ జట్టులు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్​రో శ్రీజేశ్ మొత్తం 336 మ్యాచ్‌లు ఆడాడు. అతడి ఖాతాలో రెండు ఒలింపిక్‌ పతకాలతో పాటు రెండు ఆసియా క్రీడల స్వర్ణాలు, రెండు కామన్వెల్త్‌ రజతాలు, రెండు ఛాంపియన్‌ ట్రోఫీ రజతాలు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.