ETV Bharat / snippets

సంచలనం సృష్టించిన ప్రజ్ఞానంద- క్లాసిక్ ఫార్మాట్​లో కార్ల్​సన్​పై తొలి విజయం

Raggnanandhaa Defeats Carlsen
Raggnanandhaa Defeats Carlsen (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 11:23 AM IST

Raggnanandhaa Defeats Carlsen: భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. చెస్​లో వరల్డ్​నెం.1 మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు మరోసారి ఓటమి రుచి చూపించాడు. 2024 నార్వే చెస్‌ టోర్నమెంట్‌లో మూడో రౌండ్లో తెల్ల పావులతో ఆడిన అతడు కార్ల్‌సన్‌పై పైచేయి సాధించాడు. 37 ఎత్తుల్లో ఈ మ్యాచ్​ను ప్రజ్ఞానంద గెలుచుకున్నాడు. కాగా, గత దశాబ్దకాలంగా క్లాసికల్‌ చెస్‌లో ఆధిపత్యం చలాయిస్తున్న కార్ల్​సన్​ను మట్టికరిపించి ఈ ఫార్మాట్​లో తొలి విజయం నమోదు చేశాడు. గేమ్ ప్రారంభంలో ప్రత్యర్థి కార్ల్​సన్ పొరపాట్లను ఆసరా చేసుకున్న ప్రజ్ఞానంద తనదైన శైలిలో దూసుకెళ్లి విక్టరీ కొట్టాడు. ఇక గతంలో ర్యాపిడ్‌/ఎగ్జిబిషన్‌ గేమ్స్‌లో కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద ఓడించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.