ETV Bharat / snippets

'పాక్​కు వస్తే భారత్​ను మర్చిపోయేలా- విరాట్ కోసం మేమంతా వెయిటింగ్'

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 9:19 AM IST

Virat Kohli Pakistan Visit
Virat Kohli Pakistan Visit (Source: Associated Press)

Virat Kohli Pakistan Visit: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాకిస్థాన్​కు వస్తే భారత్​ను మర్చిపోయే రీతిలో తమ​ అతిథి మర్యాదలు ఉంటాయని పాక్ మాజీ కెప్టెన్ షహీన్ అఫ్రిదీ అన్నాడు. విరాట్​కు పాకిస్థాన్​లో చాలామంది అభిమానులు ఉన్నారని తెలిపాడు. తాజాగా ఓ సందర్భంలో అఫ్రిదీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'విరాట్ ఒకవేళ పాకిస్థాన్​కు వస్తే భారత్​కు మించి మా అతిథి మర్యాదలు ఉంటాయి. అతడికి ఇక్కడ అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. విరాట్ పాకిస్థాన్​లో ఆడితే చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం' అని అఫ్రిదీ అన్నాడు.

కాగా, 2008లో అరంగేట్రం చేసిన విరాట్ ఇప్పటివరకు పాక్​లో క్రికెట్ ఆడలేదు. ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది. ఈ టోర్నీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్​కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, భద్రతాకారణాల దృష్యా టీమ్ఇండియా పాక్​లో పర్యటించబోదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్ మ్యాచ్​లన్ని తటస్థ వేదికల్లో నిర్వహించాల్సిందిగా ఐసీసీని కోరనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.