ETV Bharat / snippets

రొనాల్డో ఆశలు ఆవిరి- మైదానంలోనే స్టార్ ప్లేయర్ ఎమోషనల్

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 1:14 PM IST

Updated : Jul 6, 2024, 2:26 PM IST

Portugal vs France
Portugal vs France (Source: Associated Press)

Portugal vs France Euro 2024:ఫుట్​బాల్ దిగ్గజం పోర్చుగల్​ ఆటగాడు క్రిస్టియానా రొనాల్డో ఆశలు ఆవిరయ్యాయి. యూరో కప్​ 2024 క్వార్టర్ ఫైనల్​లో తన జట్టు ఫ్రాన్స్​ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే నిర్ణీత సమయంలో ఇరుజట్లు ఒక్క గోల్ చేయకపోవడం వల్ల గేమ్ షూటౌట్​కు వెళ్లింది. ఈ షూటౌట్​లో ఫ్రాన్స్ 3-5 తేడాతో నెగ్గింది. దీంతో తన ఆఖరి యూరో కప్​లో టైటిల్ సాధించాలనుకున్న రొనాల్డోకు నిరాశే మిగిలింది.

దీంతో ఫుట్​బాల్ దిగ్గజం మైదానంలోనే కంటతడి పెట్టాడు. తన సహచర ప్లేయర్ల్ పెపె దుఃఖం ఆపుకోలేకపోయాడు. రొనాల్డోను పట్టుకొని ఏడ్చేశాడు. కాగా, 2004లో తొలి యూరో కప్ ఆడిన రొనాల్డో కెరీర్​లో ఇప్పటిదాకా ఆరుసార్లు పోర్చుగల్​కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఈ మ్యాచ్​లో నెగ్గిన ఫ్రాన్స్​ సెమీస్​లో స్పెయిన్​తో తలపడనుంది.

Last Updated : Jul 6, 2024, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.