ETV Bharat / snippets

యూట్యూబ్​లోనూ రొనాల్డో రికార్డులు- ఆరు రోజుల్లోనే 50మిలియన్ సబ్‌స్క్రైబర్లు

author img

By ETV Bharat Sports Team

Published : Aug 28, 2024, 6:25 PM IST

Cristiano Ronaldo
Cristiano Ronaldo (Source: Associated Press)

Cristiano Ronaldo Youtube Channel: లెజెండరీ ఫుట్​బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన ఘనత సాధించాడు. యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన ఆరు రోజుల్లోనే 50మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మార్క్​ అందుకున్నాడు. ఈ క్రమంలో అతి తక్కువ సమయంలో 50మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మైలురాయి అందుకున్న యూట్యూబర్​గా రొనాల్డో రికార్డు కొట్టాడు. కాగా, రొనాల్డో యువర్ క్రిస్టియానో (UR Cristiano) పేరుతో ఆగస్టు 21న యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు.

దీనికి ఊహించని రేంజ్​లో రెస్పాన్స్ వచ్చింది. ఛానెల్ ప్రారంభించిన 90 నిమిషాల్లో 1మిలియన్, 12గంటలలోపే 13మిలియన్ల సబ్‌స్క్రైబర్లు అయ్యారు. దీంతో ఛానెల్ ఓపెనింగ్ రోజే రొనాల్డోకు యూట్యూబ్ నుంచి 'గోల్డెన్ ప్లే బటన్' అందింది. ఎప్పుడూ గ్రౌండ్​లో అదరగొట్టే రొనాల్డో యూట్యూబ్​లోనూ రికార్డులు సృష్టిస్తుండడం వల్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఛానెల్​కు 50.3మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక రొనాల్డోకు ట్విట్టర్​లో 112.6మిలియన్, ఫేస్‌బుక్‌లో 170 మిలియన్, ఇన్‌స్టాగ్రామ్‌లో 636 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.