ETV Bharat / snippets

వన్డే, టీ20లకూ కోచ్​గా మెక్​కల్లమ్- ఇకపై లిమిటెడ్ ఓవర్లలోనూ బజ్​బాల్ గేమ్!

author img

By ETV Bharat Sports Team

Published : Sep 3, 2024, 10:20 PM IST

England ODI T20 Coach
England ODI T20 Coach (Source: Associated Press)

England ODI T20 Coach: మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్​కల్లమ్​కు ప్రమోషన్ లభించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్​ టెస్టు జట్టు కోచ్​గా కొనసాగుతున్న మెక్​కల్లమ్​ వన్డే, టీ20 ఫార్మాట్​లకూ​ హెడ్​ కోచ్​గా నియమితుడయ్యాడు. దీంతో మెక్​కల్లమ్ మూడు ఫార్మట్లకు హెడ్​కోచ్​గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం వెల్లడించింది. 'ప్రస్తుతం టెస్టులో మా ఆటను ఎంజాయ్ చేస్తున్నా. వన్డే, టీ20ల్లోనూ పనిచేసేందుకు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' అని మెక్​కల్లమ్ అన్నాడు.

కాగా, 2022 మేలో టెస్టు జట్టుకు కోచ్​గా బాధ్యతలు స్వీకరించిన మెక్​కల్లమ్ తనదైన మార్క్ చూపించాడు. 'బజ్​బాల్' వ్యూహం పేరుతో సుదీర్ఘ ఫార్మాట్​లో ఇంగ్లాండ్​ ఆట విధానాన్ని పూర్తిగా మార్చేశాడు. ఇక తాజాగా వన్డే, టీ20 ఫార్మాట్​ బాధ్యతలు స్వీకరించడం వల్ల లిమిటెడ్ ఓవర్ల ఆటతీరును కూడా మారుస్తాడని అంటున్నారు. వన్డేలో టీ20 ఫార్మాట్​, టీ20లో టీ10 ఫార్మాట్​ ఆట చూడడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.