ETV Bharat / snippets

ఎస్సీ వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకు కల్పిస్తూ కేంద్రం చట్టం చేయాలి : ప్రొఫెసర్​ కోదండరాం

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 7, 2024, 6:05 PM IST

Prof Kodandaram On SC Reservations
Prof Kodandaram On SC Reservations (ETV Bharat)

Prof Kodandaram on SC Reservations : కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకు కల్పిస్తూ చట్టాన్ని చేయాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎఫ్​ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎస్సీ వర్గీకరణ సాధనకై మాదిగ రిజర్వేషన్​ పోరాట సమితి ఆధ్వర్యంలో మంగపల్లి శ్రీనివాస్​ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోదండరాం మాట్లాడారు.

ఈ చట్టం వల్ల రాష్ట్రంలో వర్గీకరణకు అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని తీసుకురావడం కోసం మాదిగ సమాజాన్ని ఎమ్మార్పీఎస్ ఏకతాటిపై తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఈ దీక్షా శిబిరానికి రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క తదితరులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. వర్గీకరణ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.