Beerla Ilaiah on Cabinet Expansion : తాను మంత్రి పదవి ఆశిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి తెలపగా ఆయన సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని, భువనగిరి పార్లమెంట్ పరిధిలో తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఇక్కడ కూడా మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు ఎమ్మెల్సీ, ఒక అడ్వైజర్ పోస్టు, ఐదు కార్పొరేషన్‌లు, పీసీసీ చీఫ్ పోస్టు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని సీఎల్పీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తనకు నమ్మకం ఉందని, కచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ను ఆదుకున్నది గొల్ల కురుమలేనన్న ఐలయ్య, కేసీఆర్ గొర్లుబర్లు ఇస్తేనే ఓడగొట్టినట్లు వివరించారు.