ETV Bharat / snippets

కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు ఈసారీ గుండు సున్నాయే : కేటీఆర్

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 11:13 AM IST

KTR On Union Budget 2024
KTR On Union Budget 2024 (ETV Bharat)

KTR Tweet On Union Budget 2024 : కేంద్ర బడ్జెట్​కు సంబంధించి బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్​లో తెలంగాణకు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదని అన్నారు. గత పదేళ్లుగా మోదీ సర్కార్ తెలంగాణపై సవతి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. 'సాధారణంగా బడ్జెట్​ అంటే తమ రాష్ట్రానికి నిధుల కేటాయింపులు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఉంటుంది. కానీ తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం దక్కలేదని' కేటీఆర్ ఆక్షేపించారు. ఈసారి కూడా రాష్ట్రానికి నిధుల కేటాయింపులు గుండుసున్నానే ఉండొచ్చని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుపొందిందని, ప్రజల కోసం ఇక్కడి కమలం పార్టీ ఎంపీలు మోదీతో మాట్లాడి ఏం మేలు చేస్తారో వేచి చూడాలని ​ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.