US On Modi Russia Visit : ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చల నేపథ్యంలో అమెరికా స్పందించింది. భారత్ తమకు ఒక వ్యూహాత్మక భాగస్వామి అని అగ్రరాజ్య విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. 'వివిధ అంశాలపై నిరంతరం సమగ్ర, స్పష్టమైన చర్చలతో ఇరు దేశాల మధ్య బంధాన్ని ముందుకు తీసుకెళ్తుంది. రష్యాతో మైత్రి కొనసాగింపుపైనా తమ ఆందోళనలను ఎప్పటికప్పుడు తెలియజేస్తునే ఉన్నాం. పుతిన్‌తో చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ప్రస్తావించాలి. రష్యా తీసుకునే ఏ నిర్ణయమైనా, ఉక్రెయిన్ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వం, ఐరాస చట్టాలను గౌరవించేలా ఉండాలని పుతిన్‌కు స్పష్టం చేయాలి. రష్యాతో సంబంధాలు కొనసాగించే ఏ దేశాన్నైనా తాము ఇదే కోరతాం' అని మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు.
'భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామి'- మోదీ రష్యా పర్యటనపై అమెరికా స్పందన
Published : Jul 9, 2024, 9:39 AM IST