ETV Bharat / snippets

'ప్రపంచ దేశాల ఆసక్తి అంతా మోదీ పర్యటనపైనే!'- ప్రధాని ఉక్రెయిన్​ విజిట్​పై అమెరికా రియాక్షన్

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2024, 12:50 PM IST

US welcomes PM Modi’s Ukraine Visit
US welcomes PM Modi’s Ukraine Visit (Associated Press)

US welcomes PM Modis Ukraine Visit : ప్రధాని నరేంద్రమోదీ ఉక్రెయిన్‌ పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ పర్యటనతో శాంతి కోసం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెస్కీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షించింది. ఈ పరిణామం ఎంతో ముఖ్యమైనదని, ప్రపంచ దేశాలు మోదీ పర్యటనపై ఆసక్తి కనబరుస్తున్నాయని శ్వేతసౌధం పేర్కొంది. ఈ పర్యటన ద్వారా రష్యా, ఉక్రెయిన్‌ ఘర్షణకు ముగింపు జరిగితే, ఎంతో ఉపయోకరంగా ఉంటుందని అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్‌ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ వెల్లడించారు.

శుక్రవారం ఉక్రెయిన్‌ వెళ్లిన మోదీ, జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లో శాంతి పునఃస్థాపన కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని మోదీ ఉద్ఘాటించారు. సమయం వృథా చేయకుండా కూర్చొని మాట్లాడుకోవాలని యుద్ధానికి ముగింపు పలకాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.