ETV Bharat / snippets

జెలెన్​స్కీతో ట్రంప్ ఫోన్​కాల్- యుద్ధాన్ని ఆపుతానని హామీ- 2025 జనవరి 20వ తేదీలోపే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 10:22 AM IST

Trump On Russia Ukraine War
Trump On Russia Ukraine War (Getty Images, ANI)

Trump On Russia Ukraine War : అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైతే రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతానని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ అన్నారు. అనేక ప్రాణాలను బలిగొనడం, లెక్కలేనన్ని కుటుంబాలను యుద్ధం నాశనం చేసిందని చెప్పారు. తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ప్రపంచంలో శాంతిని నెలకొల్పుతానని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్, ఈ విషయాల్ని ఆయనతో పంచుకున్నారు. ఇదే విషయాన్ని తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లోనూ ట్రంప్ పోస్ట్ చేశారు. జెలెన్‌స్కీతో ఫోన్ సంభాషణ బాగా జరిగిందన్న ట్రంప్, పెన్సిల్వేనియాలో తనపై జరిగిన దాడిని ఆయన ఖండించారని చెప్పారు. మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ జాతీయ సమావేశం విజయవంతం కావడంపై జెలెన్‌స్కీ అభినందనలు తెలిపారని ట్రంప్ పేర్కొన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైతే జనవరి 20న ప్రమాణస్వీకారానికి ముందే యుద్ధానికి ముగింపు పలుకుతానని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.