Mexico Steel Plant Explosion : మెక్సికోలోని స్టీల్ ప్లాంట్లో పేలుడు సంభవించడం వల్ల 12 మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక అధికారులు వెల్లడించారు. మెక్సికో నగరానికి తూర్పున 140 కి.మీ దూరంలో ఉన్న Xaloztocలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
కరిగిన ఉక్కుకు నీరు తగలగా పేలుడు సంభవించిందని, ఆ తర్వాత మంటలు చెలరేగాయని కార్మికులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.