Rohingya Killed In Myanmar : మయన్మార్‌లో రోహింగ్యా ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన 150 మంది పౌరులను ఓ సాయుధమూక హతమార్చింది. దేశ పశ్చిమ రాష్ట్రం రఖినేలో ఫిరంగి, డ్రోన్ దాడులతో ఈ దారుణానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వెనక దేశంలోని సైనిక పాలనను వ్యతిరేకిస్తున్న జాతీయ సైనిక మూక, ప్రజాస్వామ్య అనుకూల గెరిల్లాలు ఉన్నారని భావిస్తున్నారు. మయన్మార్ నుంచి సరిహద్దు నది ద్వారా బంగ్లాదేశ్‌కు పారిపోదామని ప్రయత్నిస్తున్న రోహింగ్యాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. గాయాలతో తప్పించుకున్న కొందరు రోహింగ్యాలకు వైద్య సాయం అందించిన వైద్యులు శుక్రవారం ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. అయితే ఆ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ అజమాయిషిలోని రఖినే గ్రూపునకు చెందిన అరాకన్ సైన్యం తెలిపింది.
మయన్మార్‌లో 150 మంది రోహింగ్యాల ఊచకోత!
Published : Aug 11, 2024, 8:02 AM IST