ETV Bharat / snippets

పిచాయ్‌ టు శంతను - 15 మంది టెక్​​ CEOలతో మోదీ రౌండ్‌టేబుల్‌ సమావేశం

author img

By ETV Bharat Telugu Team

Published : 16 hours ago

PM Modi attends 'fruitful' tech CEOs roundtable in New York
PM Modi attends 'fruitful' tech CEOs roundtable in New York (ANI)

PM Modi Attends Tech CEOs Roundtable In New York : అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. క్వాడ్‌ సదస్సుకు, ప్రవాస భారతీయులతో ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ఆయన, ఆ తర్వాత దిగ్గజ టెక్‌ కంపెనీల సీఈవోలతో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (MIT) స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ దీన్ని ప్రత్యేకంగా నిర్వహించింది.

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, అడోబ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శంతను నారాయణ్‌, ఎన్వీడియా సీఈవో జెన్‌సెన్‌ హాంగ్‌ సహా 15 కంపెనీల సీఈవోలు ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ప్రధాని మోదీ తన 'ఎక్స్‌' ఖాతాలో పోస్ట్ చేశారు. సీఈవోలతో ఫలప్రదమైన చర్చలు జరిగాయని, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ తదితర అంశాల గురించి చర్చించామని ఆయన తెలిపారు. 'మేడ్‌ బై ఇండియా' గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.