ETV Bharat / snippets

గాజాపై ఇజ్రాయెల్ డెడ్లీ మిస్సైల్​ అటాక్స్- 16మంది మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2024, 10:47 PM IST

Israeli Strikes In Gaza
Israeli Strikes In Gaza (AP)

Israeli Strikes In Gaza : గాజా పట్టీలో ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 16మంది పాలస్తీనావాసులు మృతిచెందారు. 34 మందికిపైగా గాయపడ్డారు. యూఎన్ సహకారంతో గాజాలో రెండవ దశ టీకాలు వేసిన చివరి రోజు ముగిసిన అనంతరం, ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసింది. ఈ క్షిపణి సెంట్రల్‌ గాజాలోని బూరీజ్‌లో ఓ నివాసం భవనంపై పడటం వల్ల, తల్లి సహా ఇద్దరు పిల్లలు మృతిచెందారు. నుసెరాయిట్‌ పట్టణంపై జరిపిన రెండు వేర్వేరు వైమానిక దాడుల్లో 9మంది మృతి చెందగా, 10మంది గాయపడ్డారు. మెుదట ఓ నివాస భవనంపై దాడి చేయగా నలుగురు మృతి చెందారు. అనంతరం శరణార్థి శిబిరంపై జరిపిన దాడిలో ఐదుగురు చనిపోయారు. ఉత్తర గాజాలోని జబాలియాలో జరిపిన వైమానిక దాడిలో నలుగురు మృతి చెందగా 24 మందికి పైగా గాయపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.