Modi Biden Bilateral Meeting : క్వాడ్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విల్మింగ్టన్ నగరంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం విడిగా భేటీ కానున్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిద, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్లతోనూ మోదీ అదే రోజు విడివిడిగా చర్చలు జరపుతారు. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈ విషయాలను వెల్లడించారు. మోదీ, బైడెన్ భేటీలో భారత్, అమెరికాలు 2 కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ఆయన తెలిపారు. వాటిలో ఒకటి ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్)కు సంబంధించినది కాగా, రెండోది భారత్-అమెరికా డ్రగ్ ఫ్రేమ్‌వర్క్‌కు చెందినదని ఆయన పేర్కొన్నారు.
బైడెన్‌తో మోదీ భేటీ - కుదరనున్న 2 కీలక ఒప్పందాలు!
Published : Sep 20, 2024, 8:43 AM IST