ETV Bharat / snippets

బార్​లోకి దూసుకెళ్లిన ట్రక్కు - 11 మంది మృతి, మరో 30మందికి గాయాలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2024, 6:46 AM IST

accident
accident (ANI)

Dominican Republic Truck Crash : డొమినికన్ రిపబ్లిక్​లో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని శాంటో డొమింగోకు పశ్చిమాన ఉన్న అజువా సౌత్రన్​ కమ్యూనిటీలోని ఒక బార్​లోకి ట్రక్కు దూసుకెళ్లడం వల్ల 11 మంది మరణించగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్​ పారిపోయాడని, అతని ఆచూకీ కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. అయితే ట్రక్కులో ఉన్న ఒక ప్రయాణికుడిని మాత్రం అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ ప్రమాదానికి కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. ట్రక్కులో అవకాడోలను తరలిస్తున్నట్లు తెలిసిందన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.