ETV Bharat / snippets

కన్నడ భామతో విజయ్​ దేవరకొండ రొమాన్స్​ - న్యూస్ లీక్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 3:53 PM IST

source ETV Bharat
Vijay Devarkonda (source ETV Bharat)

Vijay Devarkonda Ravikiran Kola Movie heroine : విజయ్ దేవరకొండ ఈ సారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న పట్టుదలతో ఫ్యూచర్ ప్రాజెక్టులపై గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్నారు. దీని తర్వాత విజయ్ దేవరకొండ 'రాజా వారు రాణి గారు' ఫేమ్​ రవికిరణ్ కోలాతో చేయనున్నారు. సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది.

అయితే ఇప్పుడు ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియను మొదలెట్టారట. తాజాగా హీరోయిన్‌ డీటెయిల్స్​ న్యూస్ లీకైంది. ఇందులో కన్నడ భామ రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మొదట సాయి పల్లవి పేరు వినిపించగా ఇప్పుడు రుక్మిణి పేరు వచ్చింది. ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు హీరోయిన్​ ఎంతో అందంగా ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.