ETV Bharat / snippets

అప్పుడు తప్పు చేసిన మాట నిజమే! : సమంత

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 10:41 AM IST

source ETV Bharat
samantha (source ETV Bharat)

Samantha Unhealthy Products Promotion : తాను గతంలో పొరపాట్లు చేసిన మాట నిజమేనని పేర్కొంది సమంత. కానీ ఇప్పుడు మాత్రం అలా అస్సలు చేయడం లేదని స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం సామ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్​గా మారింది. ఇంతకీ ఆమె దేని గురించి చెప్పిందంటే - ఈ మధ్య సామ్​ ఆరోగ్యానికి సంబంధించి పాడ్ కాస్ట్ వీడియోలను చేస్తూ అవగాహన కల్పిస్తోంది. దీనిపై ఓ నెటిజన్ "ఇప్పుడు బాగానే చెబుతున్నారు. కానీ గతంలో మీరు అనారోగ్యకరమైన బ్రాండ్స్‌ను ప్రమోట్ చేశారు కదా" అని అడిగారు. దీనికి - "గతంలో నేను తప్పులు చేసిన మాట నిజమే. కానీ అవి పూర్తిగా తెలియక చేశాను. ఆ తర్వాత వాటికి ప్రమోషన్స్ చేయడం ఆపేశాను. ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో వాటి గురించి మాత్రమే చెబుతున్నాను" అని బదులిచ్చింది. కాగా, త్వరలోనే సిటాడెల్​తో పలకరించనున్న సామ్​ దర్శకద్వయం రాజ్​డీకేతో మరో సిరీస్​కు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.