ETV Bharat / snippets

33,000 అడుగుల ఎత్తులో సల్మాన్ యాక్షన్‌!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 7:10 AM IST

Source Getty Images
salman (Source Getty Images)

Salman Khan AR Murugadoss Film : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం సికందర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. నడియాడ్ వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాజిద్ నదియాడ్​వాలా నిర్మిస్తున్నారు. 2025 ఈద్ కానుక‌గా విడుద‌ల చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన క్రేజీ వార్త ఒకటి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. మొదటి రోజు అతిపెద్ద ఎయిర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఈ షూటింగ్‌ను మొదలుపెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. తొలి షెడ్యూల్‌లో భాగంగా సల్మాన్‌తో సముద్రమట్టానికి దాదాపు 33,000 అడుగుల ఎత్తులో అద్భుతమైన వైమానిక యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సీన్​ ఈ ప్రాజెక్టుకే కీలకమైన సన్నివేశమని అంటున్నారు. ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా గడుపుతున్న రష్మికనే ఈ సినిమాలోనూ హీరోయిన్​గా నటిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.