ETV Bharat / snippets

రష్మికకు బాలీవుడ్​లో మరో సూపర్​ ఆఫర్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 7:41 AM IST

source ANI and ETV Bharat
Rashmika Ayushmann Khurrana (source ANI and ETV Bharat)

Rashmika Ayushmann Khurrana New Movie : త్వరలోనే పుష్ప 2తో ప్రేక్షకులను అలరించనున్న రష్మిక ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్​సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానాతో నటించేందుకు రెడీ అయినట్లు సమాచారం. ‘స్త్రీ’, ‘భేడియా’, ‘ముంజ్యా’ లాంటి సూపర్ హిట్​ హారర్‌ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దినేష్‌ విజన్‌ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇందుకోసం కొంత కాలంగా ఆయుష్మాన్​తో చర్చలు జరుపుతున్నారు. ఆదిత్య సత్పోదర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మడాక్‌ ఫిలిమ్స్‌ నిర్మాణ సంస్థలో రాబోతున్న ఈ సినిమాకు వాంపైర్స్‌ ఆఫ్‌ విజయ్‌నగర్‌ అనే పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం స్కిప్ట్‌ దశలో ఉందీ సినిమా. కాగా, రష్మిక చేతిలో చాలా సినిమాలున్నాయి. తెలుగులో పుష్ప-2, కుబేర, గార్ల్​ఫ్రెండ్‌, రెయిన్‌బో చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో సల్మాన్‌ఖాన్‌తో సికందర్ చేస్తోంది. ఎన్టీఆర్‌-ప్రశాంత్‌నీల్‌ కాంబోలోనే రష్మికనే నాయిక అని ప్రచారం సాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.