ETV Bharat / snippets

కొత్త డైరెక్టర్​కు రానా గ్రీన్​సిగ్నల్- షూటింగ్ ఎప్పట్నుంచంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 7:25 AM IST

Rana New Movie
Rana New Movie (Source: ETV Bharat)

Rana New Movie: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి నుంచి 'విరాట పర్వం'తర్వాత పూర్తి స్థాయి సినిమా రాలేదు. అయితే రజనీకాంత్‌ సినిమా 'వేట్టయాన్‌'లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు 'రానా నాయుడు' వెబ్​ సిరీస్‌ రెండో భాగంలోనూ నటిస్తున్నారు. ఇక స్టార్ డైరెక్టర్​తో ఓ సినిమా కన్ఫార్మైనా, అది ఇంకా పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ఆయన కొత్త దర్శకుడు కిశోర్‌ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్​పై ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో రానాతో జతకట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్​ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అక్టోబర్​లో సినిమా సెట్స్​పైకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.