ETV Bharat / snippets

ఎన్టీఆర్‌తో పోటీకి దిగిన రజనీకాంత్‌ - ఆ రోజు బాక్సాఫీస్ షేకే

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 12:54 PM IST

Source ANI and ETV Bharat
rajinikanth and ntr (Source ANI and ETV Bharat)

Rajinikanth Vettaiyan VS NTR Devara : సూపర్ స్టార్ రజనీకాంత్‌ తన కొత్త సినిమాల అప్డేట్స్​ తెలిపారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా హిమాలయాల్లో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కూలీ, వేట్టయాన్‌ గురించి చెప్పారు. "వేట్టయాన్‌ దసరా కానుకగా అక్టోబర్‌ 10న రిలీజ్ కానుంది. నా పాత్ర చిత్రీకరణ పూర్తైంది. ఇతర నటీనటులకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. లోకేశ్ కనగరాజన్‌ దర్శకత్వంలో చేస్తున్న కూలీ షూటింగ్‌ జూన్‌ 10 నుంచి ప్రారంభించనున్నారు" అని పేర్కొన్నారు. ఇక రజనీ ఇచ్చిన అప్డేట్​తో సోషల్‌ మీడియాలో దేవర వర్సెస్‌ వేట్టయాన్‌ చర్చ మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే దేవర మొదటి భాగాన్ని అక్టోబర్‌ 10న విడుదల చేయనున్నట్లు తెలిపారు. తమిళంలోనూ ఇది రిలీజ్‌ కానుంది. దీంతో అక్టోబర్​ 10న బాక్సాఫీస్‌ వద్ద పోరు ఖాయమని సినీ ప్రియులు అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.