Sardar 2 Shooting Accident : కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం సర్దార్ 2. రీసెంట్గా మొదలైన ఈ మూవీ సెట్‌లో ప్రమాదం చోటు చేసుకొంది. ఫైట్ సీన్స్ ప్రాక్టీస్ చేస్తున్న స్టంట్‌మ్యాన్ ఎజుమలై ప్రమాదవశాత్తూ 20 అడుగుల ఎత్తునుంచి కింద పడిపోయారు. వెంటనే స్పందించిన మూవీటీమ్ అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. కానీ ఫలితం దక్కలేదు. అంత ఎత్తు నుంచి కిందపడటం వల్ల ఛాతీ భాగంలో తీవ్ర గాయం అయిందని వైద్యులు తెలపారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడం వల్ల ఎజుమలై మృతి చెందాడని వైద్యులు నిర్థరించారని సమాచారం. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కార్తి హీరోగా 2022లో తెరకెక్కిన స్పై, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సర్దార్. తండ్రీ కొడుకులుగా కార్తి ద్విపాత్రాభినయం చేశారు. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహించారు. దీనికి కొనసాగింపుగానే సర్దార్ 2 తాజాగా మొదలైంది. ఇందులో ఎస్.జె.సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు.
కార్తి 'సర్దార్ 2' సెట్‌లో ప్రమాదం - అతడు మృతి
Published : Jul 17, 2024, 12:34 PM IST