HinaKhan Cancer : బాలీవుడ్ నటి హీనాఖాన్ స్టేజ్3 రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఆమె సాహసానికి సిద్ధమయ్యారు. తిరిగి షూటింగ్లలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే తెలిపారు
"లైఫ్‌లో అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటున్న సమయంలోనూ పని చేయడం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. మంచి రోజులు ఎంత తక్కువగా ఉన్నా సంతోషంగా గడపడం మర్చిపోకూడదు. కష్టాలను పెద్దగా చూడాల్సిన అవసరమే లేదు. మార్పును అంగీకరించాలి. మునుపటిలా ఉండేందుకు ట్రై చేయాలి. మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్నాను. అందుకోసం ఇష్టపడే పని చేస్తున్నాను. అందుకే షూటింగ్‌లకు రెడీ అయ్యాను. మీరు కూడా మీ మనసుకు సంతోషానిచ్చే పని చేయండి. ఛాలెంజెస్ను ఎదుర్కొనేందుకు మరింత శక్తిని ఇస్తుంది" అని రాసుకొచ్చింది. కాగా, హీనా పెట్టిన పోస్ట్‌కు చాలా మంది సామాన్యులు, సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్నారు.