Actress Pranitha subhash Second time Pregnant : బాపుగారిబొమ్మ అంటూ అత్తారింటికి దారేదితో టాలీవుడ్ ఆడియెన్స్‌ను ఫిదా చేసిన నటి ప్రణీత మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసింది. రౌండ్ 2 ఈ దుస్తులు ఇప్పుడిక సరిపోవు అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. దీంతో పలువురు సినీప్రముఖులు, అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
కాగా, ఏం పిల్లో, ఏం పిల్లడోతో టాలీవుడ్‌కు పరిచయమైన ప్రణీత ఆ తర్వాత అత్తారింటికి దారేది, రభస, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. కరోనా టైమ్‌లో పేదల కోసం తనవంతు సాయం చేసి ప్రశంసలను అందుకుంది. అనంతరం బెంగళూరుకు చెందిన బిజినెస్మెన్ నితిన్ రాజును 2021లో పెళ్లి చేసుకుంది. వీరికి 2022 జూన్‌లో పండంటి ఆడబిడ్డ జన్మించింది.