ETV Bharat / snippets

నిరుద్యోగులకు తీపి కబురు​ - రైల్వేలో 18,799 అసిస్టెంట్​ లోకో పైలట్​ పోస్టుల భర్తీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 10:12 AM IST

RRB Bhopal Assistant Loco Pilot Notification 2024
RRB Assistant Loco Pilot Jobs 2024 (ETV Bharat)

RRB Assistant Loco Pilot Jobs 2024 : నిరుద్యోగ యువతకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. గత జనవరిలో వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగాల భర్తీకి ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో మొత్తం 5,696 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్న ఆర్​ఆర్​బీ ఇప్పుడు ఆ పోస్టులను భారీగా పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.

దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఉన్న అవసరాల దృష్ట్యా మొత్తంగా 18,799 అసిస్టెంట్ లోకో పైలట్​ (ఏఎల్‌పీ) పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆర్​ఆర్​బీ భోపాల్​ వెల్లడించింది. త్వరలోనే జోన్ల వారీగా ఖాళీల వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు, త్వరలోనే ప్రాధామ్యాల నమోదుకు అవకాశం కల్పిస్తామని ఆర్‌ఆర్‌బీ భోపాల్‌ తెలిపింది. అభ్యర్థులు ఈ విషయంలో తదుపరి అప్​డేట్స్​ కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని కోరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.