Hero Bike Prices Hike : కొన్ని మోడళ్ల స్కూటర్లు, బైక్స్ ధరలను పెంచుతామని హీరో మోటోకార్ప్ సోమవారం ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్ల ధరలు సగటున రూ.1,500 వరకు పెరుగుతాయని, వీటి పెంపు జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ధరల పెరుగుదల అనేది వాహన మోడల్, కొనుగోలు చేసే నగరాన్ని బట్టి మారుతుందని తెలిపింది. వాహనాల తయారీ ప్రక్రియలో వినియోగించే ముడిసరుకులు, పరికరాల రేట్లు ప్రియం కావడం వల్ల ధరలను పెంచక తప్పడం లేదని సంస్థ వివరించింది. ఈ ప్రకటన నేపథ్యంలో సోమవారం ఉదయం బీఎస్‌ఈలో హీరో మోటోకార్ప్ షేర్ల స్వల్పంగా లాభపడ్డాయి. కాగా, మనదేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థగా హీరో మోటోకార్ప్‌కు మంచి పేరు ఉంది. ఈ కంపెనీకి చెందిన స్ప్లెండర్ మోడల్ బైక్స్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. హెచ్ఎఫ్ డీలక్స్, గ్లామర్ మోడల్ బైక్స్ కూడా బాగానే సేల్ అయ్యాయి.
టూవీలర్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్- బైక్స్, స్కూటర్స్ ధరలు పెంచనున్న హీరో
Published : Jun 24, 2024, 12:19 PM IST
|Updated : Jun 24, 2024, 12:28 PM IST