Challa Srinivasulu As Chairman Of SBI : దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎస్బీఐలో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) ఈయనే. ప్రస్తుత ఎస్బీఐ ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖారా ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. కాగా అదే రోజు శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని ఆర్థికసేవల విభాగం ప్రతిపాదించగా అందుకు మంత్రి వర్గ నియామకాల సంఘం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం తెలిపింది.
అగ్రికల్చర్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందిన శ్రీనివాసులు తన వృత్తి జీవితాన్ని ఎస్బీఐలో 1988లో ప్రొబేషనరీ అధికారిగా(పీఓ)గా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆ బ్యాంకులోనే అత్యున్నతమైన స్థాయికి చేరుకున్నారు. ఆయన తెలంగాణలోని పెద్దపోతులపాడులో జన్మించారు.