BSNL Subscribers Increased in July : టెలికాం ఛార్జీల పెంపు నిర్ణయంతో ప్రైవేటు టెలికాం కంపెనీలకు వినియోగదారులు షాకిచ్చారు. జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ యూజర్లను కోల్పోయాయి. అదే సమయంలో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ (BSNL) తమ చందాదారులను భారీగా పెంచుకోగలిగింది. జులై నెలకు సంబంధించి ట్రాయ్ వెలువరించిన డేటాలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జులై మొదటి వారంలో జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా 10-27 శాతం మేర ధరలు పెంచాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలైతే ఆరంభ ప్లాన్ ధరలను దాదాపు రెట్టింపు చేశాయి. వాటి ప్రభావంతో ఎయిర్‌టెల్ 16.9లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. వొడాఫోన్ ఐడియా 14.1 లక్షలు, జియో 7.5 లక్షల మంది చందాదారులను కోల్పోయింది. అదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్ 29.4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను పెంచుకుందని ట్రాయ్ వెల్లడించింది.
జియో, ఎయిర్‌టెల్ షాకిచ్చిన కస్టమర్లు - BSNLకు భారీగా పెరిగిన సబ్‌స్క్రైబర్లు
Published : Sep 21, 2024, 11:46 AM IST