ETV Bharat / snippets

'ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ- ఆయనే పాపులర్​ లీడర్​'

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 8:18 PM IST

Shashi Tharoor On Rahul Gandhi
Shashi Tharoor On Rahul Gandhi (ANI)

Shashi Tharoor On Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు సీనియర్ నేత శశి థరూర్​. ఈ ఎన్నికల్లో ఆయనే 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అని ప్రశంసించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఆయనే ఉండాలని అభిప్రాయపడ్డారు. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ అద్భుతమైన ప్రదర్శన చేసిందన్నారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "రాహుల్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశారు. ప్రస్తుతం ఖర్గేజీ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే లోక్‌సభలో మాకు బలమైన ప్రాతినిధ్యం ఉంది. ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే కచ్చితంగా పాపులర్‌ లీడర్‌ ప్రతిపక్ష నేతగా ఉండాలి. అందుకు రాహుల్‌ సరిగ్గా సరిపోతారు" అని థరూర్‌ అభిప్రాయపడ్డారు. కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌పై స్వల్ప ఆధిక్యంతో గెలవడంపైనా స్పందించారు. క్రికెట్‌ పరిభాషను ఉపయోగిస్తూ తాను 'సూపర్‌ ఓవర్'​లో విక్టరీ అందుకున్నానని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.