ETV Bharat / snippets

దేశంలోని ఆలయాలన్నీ ఒకే చోట! అయోధ్యలో రూ. 650 కోట్లతో 'మ్యూజియం ఆఫ్ టెంపుల్స్'

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 7:21 AM IST

Temple Museum In Ayodhya
Temple Museum In Ayodhya (ETV Bharat)

Museum of Temple in Ayodhya : దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాలను ఒకే చోట దర్శనమివ్వనున్నాయి. ఈ మేరకు అయోధ్యలో రూ.650 కోట్లతో 'మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌' నిర్మాణానికి టాటా సన్స్‌ చేసిన ప్రతిపాదనను ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అమోదించింది. మంగళవారం సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు అంగీకరం తెలిపింది. అనంతరం సంబంధిత వివరాలను పర్యావరణ శాఖ మంత్రి జైవీర్‌ సింగ్‌ తెలిపారు. 'మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌' కోసం రూ.1 నామమాత్రపు అద్దె ప్రాతిపదికన టూరిజం శాఖకు సంబంధించిన స్థలాన్ని 90ఏళ్లపాటు లీజుకు ఇవ్వనున్నామన్నారు. టాటా సన్స్‌ గతంలోనే ఈ ప్రతిపాదనలను కేంద్రం దృష్టి తీసుకెళ్లగా, యూపీ ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించిందని తెలిపారు. ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాలను ఇక్కడ తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు అయోధ్యలో మరో రూ.100 కోట్లతో టాటా సన్స్‌ చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకూ మంత్రవర్గం అమోదించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.