ETV Bharat / snippets

నాటు సారాకు 37 మంది బలి - మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్​గ్రేషియా

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 2:22 PM IST

Tamil Nadu Liquor Death
Tamil Nadu Liquor Death (ETV Bharat)

Tamil Nadu Liquor Death : తమిళనాడు కల్లకురుచి జిల్లాలో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 37కు పెరిగింది. 60కి పైగా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న వారికి 50 వేల పరిహారాన్ని సీఎం స్టాలిన్ గురువారం ప్రకటించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి గోకుల్‌ దాస్‌ నేతృత్వంలో ఏక సభ్య కమిటీని వేశారు. ఈ అంశంపై విచారణ జరిపి మూడు నెలల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి నలుగు వ్యక్తులను అరెస్ట్​ చేసినట్లు తెలిపారు. మొదటిరోజు అసెంబ్లీ సమావేశంలో శాసనసభ సభ్యులు కల్తీ మద్యం, కువైట్​ అగ్నిప్రమాదంలో మరణించిన వారికి ఒక నిమిషం మౌనం పాటించి నివాళులర్పించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.