ETV Bharat / snippets

నీట్​పై సుప్రీంకోర్టు విచారణ జులై 18కి వాయిదా

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 1:55 PM IST

Supreme Court Neet Hearing
Supreme Court Neet Hearing (ETV Bharat / ANI)

Supreme Court Neet Hearing : వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌- యూజీ 2024పై దాఖలైన పిటిషన్లను జులై 18న విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. జులై 8న దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్​టీఏ) అఫిడవిట్​లను దాఖలు చేశాయని పేర్కొంది. కొంతమంది పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు కేంద్రం, ఎన్​టీఏ దాఖలు చేసిన అఫిడవిట్లు ఇంకా అందలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. వాదనలకు ముందు తమ ప్రతిస్పందనను తెలిపేందుకు వారికి సమయం కావాలని చెప్పింది. ఈ మేరకు నీట్‌- యూజీ 2024పై దాఖలైన పిటిషన్లపై విచారణను జులై 18కి వాయిదా వేసింది.
కాగా, ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా జరిగిన నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు జులై 18న విచారణ జరపనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.