ETV Bharat / business

రిస్క్​ లేకుండా ఆదాయం సంపాదించాలా? 'సిల్వర్​ ETFs'పై ఓ లుక్కేయండి! - What Is Silver ETF - WHAT IS SILVER ETF

What Is Silver ETF : మీ పెట్టుబడికి మరింత బలం చేకూరాలని భావిస్తున్నారా? అయితే ఎవర్ గ్రీన్ మెటల్ ‘సిల్వర్‌’కు సంబంధించిన ఈటీఎఫ్‌లలో మదుపు చేయండి. ఇంతకీ 'సిల్వర్ ఈటీఎఫ్' అంటే ఏమిటి? దాన్ని ఎలా కొనాలి? ప్రయోజనం ఏమిటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

silver ETFs
Silver Bricks (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 30, 2024, 2:56 PM IST

What Is Silver ETF : మీరు భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారా? అయితే సిల్వర్ ఈటీఎఫ్​లు మీకు బెస్ట్​ ఆప్షన్ అవుతాయని చెప్పవచ్చు. 'ఈటీఎఫ్' అంటే ‘ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్’. నేడు చాలా మంది గోల్డ్ ఈటీఎఫ్‌లు, సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. అంటే డిజిటల్ ఫార్మాట్‌లో బంగారం, వెండికి సంబంధించిన కొనుగోళ్లు, అమ్మకాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే మ్యూచువల్​ ఫండ్స్‌కు, ఈటీఎఫ్‌లకు చాలా తేడా ఉంది. మ్యూచువల్​ ఫండ్స్‌ను కొనేందుకు మనం ఏదో ఒక ఆర్థిక సంస్థ లేదా బ్యాంకుకు సంబంధించిన ఫండ్​ హౌజ్‌లో పెట్టుబడి పెట్టాలి. కానీ ఈటీఎఫ్​లను మనం నేరుగా సాధారణ స్టాక్ మార్కెట్ షేర్లలాగే కొనేయొచ్చు. డీమ్యాట్​ అకౌంట్ ఉంటే సరిపోతుంది. లాంగ్ టర్మ్‌ వ్యూహంతో పెట్టుబడి పెట్టాలని భావించే వారికి సిల్వర్ ఈటీఎఫ్‌లు మంచి మార్గమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవర్ గ్రీన్ మెటల్ - సిల్వర్​
వెండిని ఎవర్ గ్రీన్ మెటల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెలి కమ్యూనికేషన్, ఆటోమొబైల్, పునరుత్పాదక ఇంధన వనరులు వంటి పారిశ్రామిక రంగాలలో సిల్వర్‌కు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. మెరుగైన మన్నిక, విద్యుత్ వాహక స్వభావాన్ని కలిగి ఉండటం అనేవి సిల్వర్‌కు ఉండే గొప్ప గుణాలు. అందుకే పరిశ్రమల్లో వినియోగించే చాలా ఉపకరణాల తయారీలో సిల్వర్ అనేది అత్యంత కీలకమైన లోహంగా ఉంది. టెలీ కమ్యూనికేషన్, ఆటో మొబైల్ రంగాలకు చెందిన చాలా పరికరాలు, విడి భాగాల తయారీలో సిల్వర్‌ను పెద్ద మొత్తంలో వినియోగిస్తుంటారు. సోలార్ ప్యానల్స్ తయారీలోనూ సిల్వర్‌నే ప్రధానంగా వినియోగిస్తుంటారు. అందుకే ఈ రంగాల నుంచి సిల్వర్ ఉత్పత్తి సంస్థలకు భారీగా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్లో లభ్యత తక్కువగా ఉండటం, పెద్దమొత్తంలో డిమాండ్ ఉండటం అనేది సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టే వారికి కలిసొచ్చే కీలక అంశం. సిల్వర్ లభ్యతలో చోటుచేసుకునే హెచ్చుతగ్గులను నిరంతరం నిశితంగా గమనిస్తూ, లబ్ధి పొందాలని భావించే వారికి సిల్వర్ ఈటీఎఫ్‌లు మంచి పెట్టుబడి మార్గం.

డిజిటల్ ఫార్మాట్‌లో సిల్వర్ ఈటీఎఫ్‌లు
ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్, ఐసీఐసీఐ, నిప్పన్, ఆదిత్య బిర్లా సంస్థలు ప్రత్యేక సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్‌లను నిర్వహిస్తున్నాయి. వీటిలో చేరి మనం కూడా సిల్వర్ ఈటీఎఫ్‌లు కొనొచ్చు, అమ్మొచ్చు. ఈ ఆర్థిక సంస్థలు సిల్వర్ రంగంలో ముడిపడిన కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. ఆయా కంపెనీల్లోని సిల్వర్ స్టాక్ ఆధారంగా, ఈ ఆర్థిక సంస్థలు తమ పెట్టుబడిదారులకు సిల్వర్ ఈటీఎఫ్‌లను డిజిటల్ ఫార్మాట్‌లో జారీ చేస్తుంటాయి. మనం కొనే సిల్వర్ స్టాక్ సేఫ్టీ గురించి, నిల్వ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, అవి డిజిటల్ ఫార్మాట్‌లో ఉంటాయి. డీమ్యాట్ ఖాతా లేని పెట్టుబడిదారులు కూడా సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌ఓఎఫ్)లలో పెట్టుబడి పెట్టొచ్చు.

స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణ
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల రిస్క్ నుంచి రక్షణ పొందేందుకు, పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను వైవిధ్యభరితంగా మార్చేందుకు సిల్వర్ ఈటీఎఫ్‌లను కూడా మన పెట్టుబడి ప్రణాళికలో భాగంగా చేర్చుకోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఉండే సిల్వర్ ఈటీఎఫ్‌లు మన డబ్బుకు కచ్చితత్వంతో కూడిన రాబడిని అందించే సాధనాలుగా ఉంటాయి. అయితే సిల్వర్ ఈటీఎఫ్​ల్లో పెట్టుబడి పెట్టేముందు కచ్చితంగా ఈ రంగంలోని నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది. 2023 సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఈటీఎఫ్ ద్వారా పెట్టుబడిదారులు ఆర్జించే ఆదాయంపై పన్ను స్లాబ్ ఆధారంగా ట్యాక్స్ విధిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ల ద్వారా వచ్చే ఆదాయంపైనా ఇదే విధంగా పన్నులు వేస్తారు.

సిల్వర్ లభ్యత డౌన్
అమెరికాలోని సిల్వర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన వరల్డ్ సిల్వర్ సర్వే ప్రకారం, 2023లో వెండికి ఉన్న పారిశ్రామిక డిమాండ్ 18,663 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ డిమాండ్ 2 శాతం మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక 2023 సంవత్సరంలో ప్రపంచంలోని వెండి గనుల్లో ఉత్పత్తి 1 శాతం మేర తగ్గిపోయింది. ఈ లెక్కన వెండి మార్కెట్ 2024లో గణనీయమైన లోటును ఎదుర్కొంటుందని అంచనా వేస్తున్నారు. గత 20 ఏళ్లలో ఇంతగా సిల్వర్ లభ్యత తగ్గడం ఇది రెండోసారి అని నిపుణులు అంటున్నారు. అంటే సిల్వర్ ఈటీఎఫ్​ల్లో పెట్టుబడి పెట్టినవారికి మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది.

నెలకు రూ.5వేలు పెట్టుబడితో రూ.42లక్షల ఆదాయం - PPF స్పెషల్ స్కీమ్​! - PPF Special Scheme

సుకన్య సమృద్ధి యోజన Vs ఈక్విటీ ఫండ్స్​ - వీటిలో ఏది బెస్ట్ ఛాయిస్​! - Investment Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.