ETV Bharat / snippets

జస్ట్ వెయిట్ అండ్ సీ- ఎగ్జిట్​ పోల్స్​కు పూర్తి విరుద్ధంగా ఎన్నికల ఫలితాలు : సోనియా గాంధీ

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 12:48 PM IST

Sonia Gandhi On Exit Polls
Sonia Gandhi On Exit Polls (ANI)

Sonia Gandhi On Exit Polls : Sonia Gandhi On Exit Polls : లోక్​సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్​ పోల్స్​కు పూర్తి విరుద్ధంగా ఉంటాయని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్​డీఏ విజయం సాధిస్తుందని చాలా ఎగ్జిట్​ పోల్స్ అంచనా వేశాయి. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అవుతారని చెప్పాయి. దీనిపై మీడియా ప్రతినిధులు సోనియాను ప్రశ్నించగా, 'జస్ట్ వెయిట్ అండ్ సీ, రానున్న లోక్​సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్​ పోల్స్​కు పూర్తి విరుద్ధంగా ఉంటాయని ఆశాభావంతో ఉన్నాం' అని సోనియా గాంధీ సమాధానమిచ్చారు. అంతకుముందు, ఎగ్జిట్​ పోల్స్​ను మోదీ మీడియా పోల్స్ అంటూ కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఇక ఇండియా కూటమి 295 సీట్లు గెలుస్తుందని కాంగ్రెస్​ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.