ETV Bharat / snippets

ఎన్నికల వేళ జమ్ముకశ్మీర్​లో ఉగ్ర కలకలం- ఎన్​కౌంటర్​లో నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

author img

By ETV Bharat Telugu Team

Published : 10 hours ago

Jammu Kashmir Encounter
Jammu Kashmir Encounter (ANI)

Jammu Kashmir Encounter : జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా ఆదిగామ్ గ్రామంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు సైనికులతో పాటు ఓ ట్రాఫిక్ పోలీసు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో శనివారం ఉదయం జమ్ముకశ్మీర్‌ పోలీసులు, భద్రతా దళాలు కలిసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. దేవ్‌సర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఎదుపడ్డారు. ఈ క్రమంలోనే ముష్కరులు కాల్పులు జరపడం వల్ల అప్రమత్తమైన సైనికులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు పారిపోగా, వారికోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.