ETV Bharat / snippets

'మనీలాండరింగ్‌ కేసుల్లోనూ బెయిల్‌ ఇవ్వొచ్చు' - సుప్రీం కోర్టు

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2024, 12:52 PM IST

SC On Money Laundering Case Bail
SC On Money Laundering Case Bail (ANI)

SC On Money Laundering Case Bail : మనీలాండరింగ్ కేసు నమోదైనప్పటికీ నిందితుడికి బెయిల్‌ ఇచ్చే నిబంధనలు, జైలు నుంచి మినహాయించే అవకాశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ అనుచరుడు ప్రేమ్ ప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఏ వ్యక్తి స్వేచ్ఛనూ హరించరాదని జస్టిస్‌ బీఆర్ గవాయ్‌, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. పీఎమ్​ఎల్​ఏ చట్టంలో సెక్షన్‌ 45 ప్రకారం నిందితుడికి విధించిన రెండు బెయిల్ షరతులు, అతడి స్వేచ్ఛను హరించాలనే కొత్త సిద్ధాంతాన్ని లిఖించలేవని ధర్మాసనం పేర్కొంది. ఆప్​ నేత మనీష్ సిసోదియాకు బెయిల్ మంజూరు చేస్తూ ఆగస్టు 9న ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ కేసులో ప్రేమ్ ప్రకాశ్‌కు మార్చి 22న బెయిల్ నిరాకరిస్తూ ఝార్ఖండ్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన ధర్మాసనం పక్కన పెట్టింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.