New Districts In Ladakh : కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. జన్‌స్కర్, డ్రాస్, శామ్, నుబ్రా, చంగ్‌థంగ్‌ను కొత్త జిల్లాలుగా షా ప్రకటించారు. అభివృద్ధి చెందిన, సంపన్నమైన లద్దాఖ్‌ను నిర్మాంచాలనే ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌లో భాగంగా, ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందుతాయని అమిత్‌షా అన్నారు. లద్దాఖ్ ప్రజలకు సమృద్ధిగా అవకాశాలను కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు - ఇకపై ప్రతి ఇంటికి ప్రభుత్వ ప్రయోజనాలు : అమిత్ షా
Published : Aug 26, 2024, 12:02 PM IST