ETV Bharat / snippets

నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ వాయిదా- తదుపరి నోటీసులో క్లారిటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 12:39 PM IST

NEET UG Counselling 2024
NEET UG Counselling 2024 (ETV Bharat)

NEET UG Counselling 2024 : వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన నీట్‌ యూజీ కౌన్సిలింగ్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వాయిదా వేసింది. శనివారం నుంచి కౌన్సిలింగ్ జరగాల్సి ఉండగా తదుపరి ప్రకటన వచ్చే వరకు వాయిదా వేస్తున్నట్లు ఎన్​టీఏ ప్రకటించింది. కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ త్వరలోనే ప్రకటిస్తుందని తెలిపింది. దీనిపై గతంలో నీట్​ కౌన్సిలింగ్​ను వాయిదా వేయాలని పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయింగా, అందుకు నిరాకరించింది. నీట్ నిర్వహణ తీరుపై జులై 8న తదుపరి విచారణ జరగనుంది. ఈ పరిణామాల వేళ ఎన్​టీఏ కౌన్సెలింగ్‌ను వాయిదా వేయడం గమనార్హం.

ఇటీవల నీట్‌ యూజీ పరీక్షలో పేపర్‌ లీకేజీలు, గ్రేస్‌ మార్కుల వ్యవహారంతో ఆందోళన వ్యక్తమయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పేపర్​ లీక్​కు సంబంధించి పలువురుని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.