ETV Bharat / snippets

మహువా మొయిత్రాపై FIRకు జాతీయ మహిళా కమిషన్​ ఆదేశం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 6:42 AM IST

NCW seeks FIR against Mahua Moitra
Mahua Moitra (ANI)

NCW Seeks FIR Against Mahua Moitra : జాతీయ మహిళా కమిషన్‌(NCW) ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మపై తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా ‘ఎక్స్‌’లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనితో ఎన్​సీడబ్ల్యూ ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి, మహువాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి రేఖాశర్మ వెళ్లారు. ఆ సమయంలో ఆమెకు ఓ వ్యక్తి గొడుగు పడుతున్న వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన మహువా 'ఆమె తన యజమాని పైజామాను ఎత్తి పట్టుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు' అని వ్యాఖ్యానించారు. తరువాత ఆ వ్యాఖ్యను ఎక్స్​ నుంచి తొలగించారు. కానీ దీనిని ఎన్​సీడబ్ల్యూ తీవ్రంగా ఖండించింది. 'భారతీయ న్యాయ సంహిత-2023'లోని సెక్షన్‌ 79 ప్రకారం మహువాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.