ETV Bharat / snippets

జమ్ముకశ్మీర్‌లో ఎన్​కౌంటర్- ముగ్గురు ఉగ్రవాదులు హతం!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2024, 10:43 AM IST

Jammu&Kashmir Encounter
Jammu&Kashmir Encounter (ANI)

Jammu And Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ-ఎల్​ఓసీ వెంబడి రెండు వేర్వేరు చొరబాటు ప్రయత్నాలను భగ్నం చేసినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ఘటనల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు భావిస్తున్నామని తెలిపింది. నిఘా వర్గాల సమాచారంతో ముష్కర మూకల కోసం అర్థరాత్రి తర్వాత మాచల్, తంగ్ధర్ ప్రాంతాల్లో పోలీసులతో కలిసి గాలింపు చేపట్టినట్లు సైన్యం వెల్లడించింది.

మాచల్ వద్ద అనుమానాస్పద కదలికలు గమనించిన బలగాలు కాల్పులు జరపగా ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోందని చినార్ కార్ప్స్‌ సైనిక విభాగం తెలిపింది. తంగ్ధర్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి జరిగిన మరో గాలింపు చర్యల్లో మరో ఉగ్రవాది హతమైనట్లు భావిస్తున్నామని పేర్కొంది. మాచల్‌, తంగ్దర్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. రాజౌరి జిల్లా ఖేరా మొహ్రా లథి, దంతాల్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టిన బలగాలపై ఒక ఉగ్రవాది కాల్పులు జరిపి పరారయ్యాడు. అతడి కోసం తనిఖీలు చేస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.