ISRO Earth Observation Satellite EOS-08 Launch Date : భూ పరిశీలన ఉపగ్రహం 'ఈవోఎస్-08'ను ఆగస్టు 16న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. స్మాల్ శాటిలైట్ లాంఛ్ వెహికల్ 'ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3' ద్వారా దీనిని నింగిలోకి పంపనున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట ఇందుకు వేదిక కానుంది. వాస్తవానికి ఈ ప్రయోగాన్ని ఆగస్టు 15న నిర్వహించాలని ఇస్రో తొలుత భావించింది. అయితే దానిని ఆగస్టు 16కు వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కానీ వాయిదా వేయడానికి గల కారణాలను సంస్థ వెల్లడించలేదు. ఈవోఎస్ బరువు 175.5 కిలోలు. ఇందులో భూ పరిశీలనల కోసం మూడు పరికరాలను ఏర్పాటు చేశారు. వాటి సాయంతో వాతావరణం, విపత్తులపై అధ్యయనం చేస్తారు. ఈ ఉపగ్రహం ఏడాది పాటు సేవలు అందిస్తుంది.
ఆగస్టు 16న ఇస్రో భూపరిశీలన ఉపగ్రహ ప్రయోగం
Published : Aug 13, 2024, 11:51 AM IST