ETV Bharat / snippets

ఇండియన్స్​కు ఐరన్​, కాల్షియం లోపం- రీసెర్చ్​లో షాకింగ్ విషయాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2024, 10:25 AM IST

Indians Deficient In Micronutrients
Indians Deficient In Micronutrients (ETV Bharat)

Indians Deficient In Micronutrients: భారతీయులు ఐరన్, కాల్షియం, ఫోలేట్​తో సహా ఆరోగ్యానికి కీలకమైన సూక్ష్మపోషకాలను సరైన మోతాదులో తీసుకోవట్లేదని 'ది లాన్సెట్‌ జర్నల్‌' అధ్యయనం ప్రచురించింది. అందులో దేశంలోని పురుషులతో పోలిస్తే ఎక్కువ మంది మహిళలు అయోడిన్​ను తగిన మొత్తంలో తీసుకోలేదని​ తెలిపింది. మహిళలతో పోలిస్తే ఎక్కువ మంది పురుషులు జింక్, మెగ్నీషియంను తగినంత మొత్తంలో తీసుకోవడం లేదని పేర్కొంది.

ప్రపంచ జనాభాలో 99.3శాతం మంది తగినంత పోషకాలు తీసుకోవడం లేదని లాన్సెట్​ జర్నల్​ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు తగినంత అయోడిన్, విటమిన్ ఈ, కాల్షియం తీసుకోవడం లేదని పేర్కొంది. ఇక వివిధ దేశాల్లో పురుషులతో పోలిస్తే మహిళలు అయోడిన్, బీ12, ఐరన్​ను తగినంత మొత్తంలో తీసుకోవడం లేదని చెప్పింది. ఇక, మహిళలతో పోలిస్తే ఎక్కువ మంది పురుషులు మెగ్నీషియం, విటమిన్ బీ6, జింక్, విటమిన్-సీని తగినంత తీసుకోవట్లేదని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.