ETV Bharat / snippets

'త్వరలో డ్రగ్స్‌ సరఫరా విధ్వంసక వ్యవస్థ - దేశంలోకి ఒక్క గ్రాము కూడా రానివ్వం' - అమిత్ ​షా

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 7:50 AM IST

Amit Shah About Drugs
Amit Shah (ANI)

Amit Shah About Drugs : డ్రగ్స్‌ సరఫరా నియంత్రణ కోసం త్వరలో కొత్త విధ్వంసక వ్యవస్థను తెచ్చేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఒక్క గ్రాము డ్రగ్‌ను కూడా దేశంలోకి రానివ్వమని, అలాగే మన దేశం ద్వారా ఇతర దేశాలకు సరఫరా కానివ్వమని స్పష్టం చేశారు. డ్రగ్స్​ సరఫరా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. గురువారం దిల్లీలో జరిగిన కేంద్ర, రాష్ట్ర యాంటీ నార్కోటిక్‌ సంస్థల 7వ అపెక్స్‌ సమావేశంలో అమిత్​ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు, మానస్‌ (MANAS) పేరుతో '1933' హెల్ప్‌లైన్‌ నంబరును, info.ncbmanas@gov.in ఈ-మెయిల్‌ ఐడీని ప్రారంభించారు. వీటితోపాటు ncbmanas.gov.in అనే వెబ్‌సైట్‌లోనూ డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని, మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ)కి అందించవచ్చని అమిత్‌ షా పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.