నీట్-యూజీ 2024 పరీక్ష నిర్వహణలో ఎవరిదైనా 0.001శాతం నిర్లక్ష్యం ఉన్నా దానిని పూర్తిగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మే 5న జరిగిన పరీక్షకు సంబంధించిన రెండు వేర్వేరు పిటిషన్లను ధర్మాసనం విచారించింది. కేంద్రంతో పాటు NTA తరఫున వాదిస్తున్న న్యాయవాదులకు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ SVN భట్టితో కూడిన వెకేషన్ బెంచ్ పలు సూచనలు చేసింది. ఈ పరీక్షలకు సన్నద్ధం కావడంలో పిల్లలు పడే శ్రమ అందరికీ తెలుసన్న ధర్మాసనం, వ్యవస్థను మోసం చేసి డాక్టర్ అయ్యే వ్యక్తి సమాజానికి ఎంత హానికరమో ఊహించండని పేర్కొంది. పరీక్ష నిర్వహణలో ఏదైనా పొరపాటు జరిగితే దానికి తీసుకోబోయే చర్యలను చెప్పాలని NTAకు చురకలంటించింది. అప్పుడే NTA పనితీరుపై నమ్మకం ఏర్పడుతుందని ఏజెన్సీ తరఫు న్యాయవాదులకు చెప్పింది. అనంతరం విచారణను జులై 8కి వాయిదా వేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లు అదే రోజున విచారించనున్నట్టు పేర్కొంది.
'నీట్ నిర్వహణలో 0.001శాతం నిర్లక్ష్యం ఉన్నా పూర్తిగా పరిష్కరించాలి'- NTA, కేంద్రంతో సుప్రీం
Published : Jun 18, 2024, 2:27 PM IST